Committee kurrollu: రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే

ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ  ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Updated : 08 May 2024 09:39 IST

ట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ  ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రధారులుగా...  యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నిహారిక కొణిదెల సమర్పణలో... పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ‘గొర్రెలా...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విడుదల చేశారు. ‘రోడ్లన్నీ గతుకులపాలే ఊరంతా చీకటిపాలే... రేషన్లు, పింఛన్లన్నీ మొత్తానికి గల్లంతాయే...’ అంటూ సాగే ఈ పాటని అనుదీప్‌ దేవ్‌ సంగీత సారథ్యంలో నాగ్‌ అర్జున్‌రెడ్డి రాశారు. అనుదీప్‌ దేవ్‌, వినాయక్‌, అఖిల్‌ చంద్ర, హర్షవర్ధన్‌ చావలి, ఆదిత్య భీమతాటి, సింధూజ శ్రీనివాసన్‌, మనీషా పండ్రాంకి, అర్జున్‌ విజయ్‌ పాడారు. పాట విడుదల అనంతరం జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ ‘‘దేశ భవిష్యత్తుని కాపాడాలంటే యువతలో సరైన ఆలోచన ఉండాలి. ఓటు వేయడంలో మార్పు రావాలి. నిరాశని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలి. అందరిలోనూ ఆలోచన రేకెత్తించేలా ‘కమిటీ కుర్రోళ్ళు’ బృందం మంచి పాటని తీసుకొచ్చింద’’ని అభినందించారు. చిత్ర సమర్పకులు నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘జయప్రకాశ్‌ నారాయణ సర్‌ ప్రసంగం వినే మా దర్శకుడు ఈ సినిమాని మొదలు పెట్టారు. ఆయన చేతులమీదుగానే ఈ పాట విడుదల కావడం ఆనందంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని