Samantha: అల్ట్రా సంగీత ఉత్సవాల్లో ‘‘ఉ అంటావా’’

‘‘ఉ అంటావా.. మామ.. ఉఊ ఉంటావా’’ అంటూ పుష్ప చిత్రంలో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. గతంలో ఈ గీతం య్యూటూబ్‌ వరల్డ్‌ మ్యూజిక్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాట అమెరికాలో జరిగే అల్ట్రా సంగీత ఉత్సవాల్లో

Updated : 28 Mar 2022 09:38 IST

‘‘ఉ అంటావా.. మామ.. ఉఊ ఉంటావా’’ అంటూ పుష్ప చిత్రంలో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. గతంలో ఈ గీతం య్యూటూబ్‌ వరల్డ్‌ మ్యూజిక్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాట అమెరికాలో జరిగే అల్ట్రా సంగీత ఉత్సవాల్లో మరోసారి చర్చల్లోకి వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా  తెరకెక్కిన ‘పుష్ప-ది రైజ్‌’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రముఖ కథానాయిక సమంత ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మార్చి 25 నుంచి ‘అల్ట్రా మ్యూజిక్‌ ఫెస్టివల్‌’ మొదలైంది. ఆదివారం ఈ ఉత్సవాలు  ముగిశాయి. ఈ సందర్భంగా అక్కడ ‘ఉ అంటావా...’ పాటను ప్రదర్శించారు. ఈ  విషయాన్ని, విజువల్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది సమంత. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ‘‘నమ్మలేకున్నా. చాలా ఆనందంగా ఉంది. ఈ సంగీత ఉత్సవాల్లో నా పాట ప్రదర్శించడం గర్వంగా ఉంద’’ని చెప్పింది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీత సారథ్యం వహించగా.. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని