‘వకీల్‌సాబ్‌’ పవన్‌పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

టాలీవుడ్ స్టార్‌ పవన్ కల్యాణ్‌, శృతి హాసన్ జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణను జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated : 29 Dec 2020 22:23 IST

హైదరాబాద్: అగ్రకథానాయకుడు పవన్ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఇందులోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ‘‘పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతుంది. పోలీసుల షీల్డ్స్‌ మీద స్టూడెంట్స్ కొడతారు. పోలీస్ అనే లెటర్ మీద కొట్టడం ఇష్టం లేక పవన్‌ ఆ స్టిక్కర్స్‌ని తొలగించారు. పోలీస్‌ శాఖ మీద ఉన్న గౌరవంతోనే స్టిక్కర్స్ తీసేయాలని నిర్ణయించారు’’ ఈ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్, శృతి హాసన్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  తమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మగువా.. మగువా’ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని