Parineeti-Raghav: పరిణీతి పెళ్లికి రాలేకపోయిన ప్రియాంక చోప్రా.. అసలు కారణమిదే

హీరోయిన్‌ పరిణితీ చోప్రా-రాఘవ్‌ చద్దాల (Raghav Chadha)వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రియాంక చోప్రా రాకపోవడానికి గల కారణాన్ని ఆమె తల్లి వివరించారు.

Published : 25 Sep 2023 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే పరిణితీ సోదరి బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మాత్రం రాకపోవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీంతో రకరకాల రూమర్స్‌ కూడా హల్‌చల్‌ చేశాయి. తాజాగా ఈ విషయంపై ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా మాట్లాడారు.

‘పెళ్లి చాలా బాగా జరిగింది.  వధూవరులిద్దరూ చాలా అందంగా ఉన్నారు. సినిమాలకు సంబంధించిన గతంలో ఇచ్చిన డేట్స్‌ ఒప్పందం కారణంగా ప్రియాంక చోప్రా ఈ వివాహానికి రాలేకపోయింది.  ఇక పెళ్లికి వచ్చే అతిథులు బహుమతులు తీసుకురాకూడదనే నిబంధన పెట్టారు. కేవలం ఆశీర్వాదం ఇస్తే చాలని తెలిపారు’ అని మధుచోప్రా తెలిపారు. ఈ పెళ్లికి ప్రియాంక తన భర్తతో కలిసి హాజరవుతారని అభిమానులంతా అనుకున్నారు. ఇక నూతన వధూవరులకు ఆమె తన ఇన్‌స్టాలో శుభాకాంక్షలు తెలిపారు. పరిణితీ, రాఘవ్‌ చద్దాల ఫొటో షేర్‌ చేసిన ప్రియాంక.. ‘ప్రియమైన సోదరి.. నా దీవెనలు నీకు ఎప్పటికీ ఉంటాయి’ అని పేర్కొంది. 

 ప్రభాస్‌ సరసన శ్రీలీల!.. ఇప్పుడిదే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ..

ఇక పెళ్లి తర్వాత  పరిణీతి చోప్రా (Parineeti Chopra) పెట్టిన మొదటి సోషల్ మీడియా పోస్ట్‌ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘కొత్త జీవితం మొదలయ్యాక ఇది నా మొదటి పోస్ట్‌. ఈరోజు కోసం మేము ఎంతో కాలంగా ఎదురుచూశాం.  ఒకరిని విడిచి ఒకరం ఉండలేం. ఎప్పటికీ సాగే మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా కామెంట్లలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రియాంక కూడా ఈ పోస్ట్‌కు హార్ట్‌ ఎమోజీలు కామెంట్‌ చేసింది. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు