Prabhas: ప్రభాస్‌ సరసన శ్రీలీల!.. ఇప్పుడిదే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ..

స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas) సరసన ఓ సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

Published : 25 Sep 2023 13:21 IST

హైదరాబాద్‌: ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ శ్రీలీల చిత్రాలు వరుసగా అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఆమె భాగం కానుందని వార్తలు వస్తున్నాయి.

‘సీతారామం’తో అందరి మనసులు గెలిచిన హను రాఘవపూడి స్టార్‌ హీరో ప్రభాస్‌(Prabhas)తో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్టోరీని ప్రభాస్‌, శ్రీలీలకు వినిపించగా వీళ్లిద్దరూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ప్రేమకథా చిత్రంగా రానున్న ఇందులో మొదట బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు టాక్‌ వినిపించింది. అయితే తాజాగా శ్రీలీల పేరు తెరపైకి రావడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌ 23 ప్రభాస్‌ పుట్టినరోజున దీనికి సంబంధించి అధికారిక వివరాలు వెల్లడిస్తారని సమాచారం.

సెప్టెంబరు ఆఖరివారం.. అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?

ఇక ప్రభాస్‌ ప్రస్తుతం ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’, ‘స్పిరిట్‌’లతో పాటు మారుతితో ఓ మూవీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన విడుదల తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక శ్రీలీల నటించిన ‘స్కంద’ సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలకృష్ణతో (Balakrishna) కలిసి ఆమె నటించిన ‘భగవంత్‌ కేసరి’ అక్టోబర్‌ 19న విడుదల కానుంది. వీటితోపాటు మరో ఆరు సినిమాలు శ్రీలీల ఖాతాలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు