Allu Arjun: నిర్మాత నాగవంశీ అప్‌డేట్‌.. అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబో గురించేనా?

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిర్మాతల్లో నాగ వంశీ ఒకరు. ఆయన తాజాగా చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటంటే?

Updated : 02 Jul 2023 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)- దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) మరోసారి కలిసి పనిచేయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ (Geetha Arts), హారికా- హాసిని క్రియేషన్స్‌ (Haarika & Hassine Creations) సంస్థలు సంయుక్తంగా ఆ సినిమాని నిర్మించనున్నాయని సినీ వర్గాల్లో టాక్‌ వినిపించింది. నిర్మాత నాగవంశీ (Naga Vamsi) తాజా ట్వీట్‌ ఆ వార్తలకు బలాన్ని చేకూర్చేలా ఉంది. రేపు ఉదయం 10 గంటల 8 ని.లకు అప్‌డేట్‌ ఉంటుందని అభిమానులకు తెలియజేస్తూ సదరు ప్రొడక్షన్స్‌ హౌజ్‌ల ట్విటర్‌ ఖాతాలను ఆయన ట్యాగ్‌ చేయడంతో చేయడంతో త్రివిక్రమ్‌- అర్జున్‌ కాంబోని రేపు అధికారికంగా ప్రకటించనున్నారని స్పష్టమవుతోంది. మరోవైపు, ఇదే అప్‌డేట్‌ గురించి చెబుతూ.. అల్లు అర్జున్‌ పేరు (షార్ట్‌కర్ట్‌) (updAAte)ని గీతా ఆర్ట్స్‌ కోట్‌ చేసింది. ప్రత్యేక వీడియో ద్వారా అనౌన్స్‌మెంట్‌ చేయనున్నారని తెలుస్తోంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులో అది ఒకటిగా ఉంటుందని సమాచారం.

‘జులాయి’ (julayi)తో తొలి ప్రయత్నంలోనే విశేష క్రేజ్ పొందిన త్రివిక్రమ్‌- అల్లు అర్జున్‌ కాంబో.. ఆ తర్వాత ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ (S/O Satyamurthy), ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. ఇప్పుడా కాంబినేషన్‌లో రూపొందనున్న నాలుగో సినిమాపై అంచనాలు నెలకొంటున్నాయి. ఇదే కాంబోలో ఓ వాణిజ్య ప్రకటన ఇటీవల రూపొందింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ (pushap 2)లో నటిస్తున్నారు. హీరోగా ఆయనకు ఇది 21వ చిత్రం. గతంలో.. ఇతర దర్శకులతో అల్లు అర్జున్‌ సినిమాలని ప్రకటించినా వాటిపై స్పష్టత లేదు. ‘పుష్ప 2’ పూర్తయిన తర్వాత ఆయన తివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తే, అది 22వ సినిమా అవుతంది. మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘అతడు’ (athadu), ‘ఖలేజా’ (Khaleja) తర్వాత ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. మరి, సోమవారం ఉదయం రాబోయే అప్‌డేట్‌ ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని