Lal Salaam: లాల్‌ సలాం రాక ఆలస్యం?

‘జైలర్‌’గా ప్రేక్షకులను అలరించిన ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌.. త్వరలో మొయిద్దీన్‌ భాయ్‌గా తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

Updated : 23 Dec 2023 09:33 IST

జైలర్‌’గా ప్రేక్షకులను అలరించిన ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌.. త్వరలో మొయిద్దీన్‌ భాయ్‌గా తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సలాం’. ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి రానున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు మరికొంత కాలం ఆగాల్సిందే. తాజాగా ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కపిల్‌ దేవ్‌, జీవిత అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని