RamCharan: ఆరోజు నాన్న మాటలకి కన్నీళ్లు వచ్చేశాయ్: చరణ్
తన తండ్రి, అగ్ర కథానాయకుడు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని రామ్‌చరణ్ అన్నారు. వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.....
హైదరాబాద్: తన తండ్రి, అగ్ర కథానాయకుడు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని రామ్‌చరణ్ అన్నారు. వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ షూట్‌కు సంబంధించి రామ్‌చరణ్ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా షూట్‌ని తాను ఎంతగానో ఎంజాయ్ చేశానని అన్నారు.
ఆ క్షణం నాన్నను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నా..!
‘‘ఇంటి నిర్మాణ పనుల రీత్యా గత నాలుగేళ్లుగా నేను, నాన్నా దూరంగా ఉన్నాం. వీకెండ్స్‌లో అప్పుడప్పుడూ కలుస్తుంటాం. కానీ, ‘ఆచార్య’ సినిమా వల్ల మేమిద్దరం ఎక్కువ సమయం కలిసి ఉండే అవకాశం వచ్చింది. సుమారు 18 రోజులపాటు ఓ అటవీ ప్రాంతంలో మా ఇద్దరిపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ షెడ్యూల్ జరిగినన్ని రోజులు మేమిద్దరం ఒకే కాటేజీలో ఉన్నాం. రోజూ ఉదయాన్నే నిద్రలేవడం, ఇద్దరం కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేయడం, ఒకే కారులో లొకేషన్‌కి వెళ్లడం, షూట్ పూర్తి కాగానే కలిసి కాటేజీకి రావడం, కలిసి భోజనం చేయడం.. ఇలా ఆ క్షణాలు మధురంగా గడిచిపోయాయి. నా జీవితంలో ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అప్పుడు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇదిలా ఉండగా, అదే సమయంలో ఓ రోజు నిద్రలేచిన వెంటనే నా వద్దకు వచ్చి.. ‘‘చరణ్.. వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఎప్పటికో కానీ మనిద్దరం ఇలా కలుసుకునే అవకాశం రాదు. నీతో సమయాన్ని కేటాయించే అవకాశం మళ్లీ నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ‘ఆచార్య’ వల్ల మనకు ఆ ఛాన్స్ దొరికింది. ప్రతి సెకన్‌ని కలిసి ఎంజాయ్ చేద్దాం’’ అని చెప్పారు. నాన్న మాటలతో నాకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే ఆయన్ని గట్టిగా హత్తుకుని.. ‘‘తప్పకుండా. ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకుందాం’’ అని చెప్పా’’
ఆ మాట నేను ఒప్పుకోను..!
‘‘ఈ సినిమాలో నాన్న వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారని మార్కెట్లో టాక్ వినిపిస్తోంది. అది నిజం. మ్యూజిక్ పరంగా వింటేజ్ ఫీల్ తీసుకురావడం కోసం మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకుందామని కొరటాల శివనే ప్రపోజల్ పెట్టారు. ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ అదరగొట్టేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక, నాన్న, నేనూ కలిసి చేసిన సాంగ్ చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ సాంగ్ షూట్ జరిగినప్పుడు అమ్మ, నానమ్మ సెట్లో ఉన్నారు. ‘మా కొడుకు బాగా చేశారంటే, మా అబ్బాయి బాగా చేశాడు’ అని సరదాగా చెప్పుకున్నారు. ఆరోజు మా అమ్మ కళ్లలో ఆనందాన్ని చూశా. ఇలాంటి ఎన్నో మధుర క్షణాలు నాకందించినందుకు దర్శకుడికి థ్యాంక్యూ. నిజం చెప్పాలంటే, నేను గొప్ప డ్యాన్సర్‌నని అందరూ చెప్పుకుంటున్నారు దాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే.. చిరంజీవికి ఎవరూ సాటి కాదు. ఆయన డ్యాన్స్ చేస్తే శరీరంలోని ప్రతి భాగం ఆఖరికి వెంట్రుకలు కూడా అందులో భాగమై.. డ్యాన్స్ చేస్తాయి. ‘ఆచార్య’ చిత్రాన్ని నాన్నమ్మ, అమ్మ, నాన్నలతో కలిసి చూడటం ఒక వరంగా భావిస్తా’’ అని చరణ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.