Ritika Singh: ‘ఊ అంటావా’కి ‘కాల పక్కారా’కు ఎలాంటి సంబంధం లేదు: రితికా సింగ్‌

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King Of Kotha)లో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్‌ చేశారు నటి రితికా సింగ్‌ (Ritika Singh). ఈ పాటను అంగీకరించడానికి గల కారణాన్ని తాజాగా ఆమె వెల్లడించారు.

Published : 17 Aug 2023 19:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King Of Kotha)లోని ‘కాల పక్కారా’కు.. ‘పుష్ప’ (Pushpa)లోని ‘ఊ అంటావా మావ’ పాటకు ఎలాంటి సంబంధం లేదని నటి రితికా సింగ్‌ (Ritika Singh) అన్నారు. ‘ఊ అంటావా’లోని భావాలు ఈ పాటలో లేవని ఆమె చెప్పారు. ఇదొక స్పెషల్ డ్యాన్స్‌ నంబర్‌ మాత్రమేనని తెలిపారు.

‘‘దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’లో నేనొక ఐటెం సాంగ్‌ చేశా. ‘కాల పక్కారా’ అంటూ సాగే ఈ పాట విడుదలయ్యాక.. ‘ఐటెం నంబర్‌ ఎందుకు చేస్తున్నావు?’ అని చాలా మంది అడిగారు. ఈ పాటలో ఎక్కడా కూడా అశ్లీలత కనిపించదు. నన్ను కించపరిచేలా పదాలు ఉపయోగించలేదు. సున్నితంగా చిత్రీకరించారు. దుల్కర్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో ఒక మలయాళం సినిమాలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ వంటి సినిమాలో నాకు ఛాన్స్‌ రావడం ఆనందంగా ఉంది. ఇదొక అద్భుత అవకాశం. అలాగే నాకు డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పాట ఓకే చేశా’’ అని ఆమె చెప్పారు. అనంతరం ఆమె ‘ఊ అంటావా’ పాటతో దీనిని పోల్చి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఆ పాటలో సమంత - అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ పాట వీక్షించానన్నారు.

Baby movie ott: ఓటీటీలో ‘బేబీ’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) నటిస్తోన్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King Of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైనా అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలను చూస్తే దుల్కర్‌ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని