Samantha: అలా కొనసాగించడం నావల్ల కాలేదు!

మయోసైటిస్‌ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత.. సామాజిక మాధ్యమాల్లో మునుపటిలా సందడి చేస్తోంది. తన సినిమాలకు సంబంధించిన కబుర్లు పంచుకుంటూ సినీ ప్రియులకు చేరువ అవుతోంది.

Updated : 09 Jan 2023 07:01 IST

యోసైటిస్‌ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత (Samantha).. సామాజిక మాధ్యమాల్లో మునుపటిలా సందడి చేస్తోంది. తన సినిమాలకు సంబంధించిన కబుర్లు పంచుకుంటూ సినీ ప్రియులకు చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన కొత్త సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam) విషయంలో ఎదురైన ఓ సవాల్‌ను తెలియజేసింది. ఇందులో నటించేటప్పుడు ఆ పాత్ర స్వభావానికి తగ్గట్లుగా ముఖంలో హావభావాలు ఒకేలా పలికించడం.. ఒకే భంగిమలో ఉండటం కష్టంగా అనిపించినట్లు చెప్పింది. ‘‘నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు.. ఆఖరికి ఏడ్చేటప్పుడు కూడా ముఖంలో ఎక్స్‌ప్రెషన్‌ ఒకేలా పెట్టాల్సి వచ్చింది. అలాగే ఈ భంగిమనే కొనసాగించాల్సి వచ్చింది. అలా ఒకే స్టైల్‌ను కొనసాగించడం నావల్ల కాలేదు. దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలా కాకుండా ఈ సాషా (సమంత పెంపుడు కుక్క)ను తీసుకువెళ్లాల్సింది’’ అంటూ దీనంగా చూస్తున్న తన పెంపుడు కుక్క వీడియోతో పాటు ‘శాకుంతలం’ భంగిమలో ఉన్న తన ఫొటోను నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని