balakrishna: బాలకృష్ణకు జోడీగా శ్రద్ధ?

బాలకష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ చిత్రం రూపొందుతోంది. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 31 Jan 2024 09:36 IST

బాలకష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ చిత్రం రూపొందుతోంది. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ ఓ కథానాయికగా కనిపించనుందని సమాచారం. ఆమె ఇటీవలే ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్ర నైట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనిలో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. 1980ల దశకం నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని