
Shruthi Hassan: ఆద్యగా శ్రుతిహాసన్
కథానాయిక శ్రుతిహాసన్ తెలుగులో వరుసగా అవకాశాల్ని అందుకొంటోంది. ‘క్రాక్’ తర్వాత ఆమె కెరీర్ మరోమారు ఊపందుకున్నట్టే. ప్రభాస్‌తో కలిసి ‘సలార్’లో నటిస్తున్న ఆమె, బాలకృష్ణ, చిరంజీవి సినిమాల్లో కూడా అవకాశాల్ని అందుకొంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘సలార్’లో ఆద్య అనే పాత్రలో నటిస్తోంది శ్రుతిహాసన్. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ‘సలార్’ చిత్రబృందం శ్రుతి లుక్‌ని విడుదల చేసింది. ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.