Sudheer babu: యాక్షన్‌ షురూ

సుధీర్‌బాబు కథా నాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుధీర్‌బాబు ఇందులో

Updated : 30 Mar 2022 08:08 IST

సుధీర్‌బాబు కథా నాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుధీర్‌బాబు ఇందులో ఓ శక్తివంతమైన పోలీస్‌ అధికారి పాత్రని పోషిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సుధీర్‌బాబు మా సంస్థలో ‘శమంతకమణి’ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆయన కనిపించే విధానం, పోరాట ఘట్టాలు కొత్తగా ఉంటాయి. ఏప్రిల్‌ 23 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. శ్రీకాంత్‌, ‘ప్రేమిస్తే’ భరత్‌ తదితరుల పాత్రలు గుర్తుండిపోయేలా ఉంటాయ’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని