Vijay devarakonda: విజయ్‌ దేవరకొండ సినిమా క్యాన్సిలంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

విజయ్‌ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి సినిమా ఆగిపోయిందంటూ వస్తోన్న వార్తలపై టీమ్‌ స్పందించింది.

Updated : 17 Jan 2024 15:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గౌతమ్‌ తిన్ననూరితో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. #VD12 పేరుతో ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమాపై వస్తోన్న తప్పుడు వార్తలను టీమ్ ఖండించింది.

ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగి 8 నెలలైంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని వదంతులు మొదలయ్యాయి. బడ్జెట్‌ కారణంగా ఈ చిత్రం నిలిచిపోయిందని కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. వీటిపై టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు నమ్మొద్దని పేర్కొంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాతో బిజీగా ఉన్నారని.. అది పూర్తయ్యాక ఈ షూటింగ్‌ మొదలుపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలిపింది.

‘ఓజీ’లో పవన్‌ పాట పాడతారా.. తమన్‌ ఏమన్నారంటే!

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయిక. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే న్యూయార్క్‌లో ఒక షెడ్యూల్ పూర్తయింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మృణాల్ ఠాకూర్‌ కథానాయిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు