Akhanda: ‘అఖండ’ విజయోత్సవం

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతోపాటు.. ఓవర్సీస్‌లో  మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన ‘అఖండ’ సినిమా విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది ఆ చిత్రబృందం.

Updated : 27 Dec 2021 07:23 IST

గ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతోపాటు.. ఓవర్సీస్‌లో  మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన ‘అఖండ’ సినిమా విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది ఆ చిత్రబృందం. బోయపాటి శ్రీను దర్శకత్వం  వహించిన ‘అఖండ’ విడుదలై  25 రోజులైంది. ఈ సందర్భంగా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన పంపిణీదారులతో కలిసి చిత్రబృందం ఇటీవల హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. ఇందులో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి కలిసి పంపిణీదారులకి, సినీ వర్గాలకి జ్ఞాపికల్ని అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని