
Updated : 03 Dec 2021 09:32 IST
Anand Devarakonda: ‘హైవే’లో ఏం జరిగింది?
ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా కేవీ గుహన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హైవే’. వెంకట్ తలారి నిర్మాత. మానస రాధాకృష్ణన్ కథానాయిక. అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సినిమాలోని నటీనటుల కాన్సెప్ట్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథే ‘హైవే’. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది’’ అన్నారు. ‘‘నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి’’ అన్నారు నిర్మాత.
Advertisement
Tags :