GullyRowdy: ‘గల్లీరౌడీ’ని పరిచయం చేసిన స్టేట్‌రౌడీ

కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ప్రధానపాత్రలో నటించిన ‘గల్లీరౌడీ’ ట్రైలర్‌ను అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీతోపాటు...

Published : 12 Sep 2021 17:06 IST

మెగాస్టార్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ప్రధానపాత్రలో నటించిన ‘గల్లీరౌడీ’ ట్రైలర్‌ను అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీతోపాటు ఫుల్‌టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ‘గల్లీరౌడీ’ ట్రైలర్‌ను చిరంజీవి చేతుల మీదుగా చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సందీప్‌ కిషన్‌ విభిన్నమైన పాత్ర పోషించారు. విశాఖపట్నంలో ‘గల్లీరౌడీ’గా ఆయన కనిపించనున్నారు. సందీప్‌ డైలాగులు, కామెడీ టైమింగ్‌, బాబీ సింహా యాక్షన్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ తర్వాత సందీప్‌ కిషన్‌-జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ఇందులో సందీప్‌కు జోడీగా నేహాశెట్టి సందడి చేశారు. బాబీ సింహా ప్రతినాయకుడు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్‌ మిరియాల, సాయికార్తిక్‌ స్వరాలు అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని