Paagal: పాగల్‌ ఫస్ట్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది..!

‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు విశ్వక్‌సేన్‌. ఈసారి ఆయన లవర్‌బాయ్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పాగల్‌’. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.....

Published : 08 Aug 2021 13:12 IST

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు విశ్వక్‌సేన్‌. ఈసారి ఆయన లవర్‌బాయ్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పాగల్‌’. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘పాగల్’ నుంచి ఫస్ట్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసింది. ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ అంటూ సాగే ఈ లిరికల్‌ పాటకు ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. కాగా, తాజాగా వచ్చిన ఈ పాట ఫుల్‌ వీడియో ఆకట్టుకునేలా ఉంది. విభిన్నమైన ప్రేమకథతో యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విశ్వక్‌ మాస్ ప్రేమికుడిగా కనిపించనున్నారు. దిల్‌ రాజు సమర్పణలో వేణుగోపాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్‌ కథానాయిక. రాధన్‌ స్వరాలు సమకూర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని