The Deepest Breath: ఇప్పుడు ట్రైలర్‌ అవసరమా?

తాజాగా ‘ది డీపెస్ట్‌ బ్రీత్‌’ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్‌ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. సముద్రంలో ఫ్రీడైవింగ్‌ చేసే నేపథ్యంలో దీన్ని తెరకెక్కించారు.

Updated : 23 Jun 2023 07:51 IST

తాజాగా ‘ది డీపెస్ట్‌ బ్రీత్‌’ (The Deepest Breath) డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్‌ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. సముద్రంలో ఫ్రీడైవింగ్‌ చేసే నేపథ్యంలో దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌ సామజిక మాధ్యమాల ద్వారా ఇన్ని విమర్శలను ఎదుర్కొవడానికి కారణం... టైటాన్‌ మినీ జలాంతర్గామి ఆచూకీ సముద్రంలో గల్లంతై పేలిపోవడమే.

అట్లాంటిక్‌ మహా సముద్రంలో 111ఏళ్ల కిందట మునిగిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ ఐదుగురి బృందం ఇందులో వెళ్లారు. వారు వాడిన ఓ మినీ జలాంతర్గామి సముద్రంలోకి ప్రవేశించిన కొద్దిసేపట్లోనే పోలార్‌ ప్రిన్స్‌తో ఉన్న కమ్యునికేషన్‌ ఆగిపోయింది. వారి ఆచూకీ కోసం గురువారం గాలింపు చర్యలు సాగుతుంటే ఫ్రీడైవింగ్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేసినందుకుగానూ నెట్‌ఫ్లిక్స్‌ విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. మరోవైపు తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్‌’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది.

ఫ్రీడైవింగ్‌లో వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్న అలేసియా జెచీని జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సముద్రంలో ప్రాణంతో చెలగాటం ఆడినట్టు చూపించిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ అభిమానులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌరా మేక్‌గన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ డాక్యుమెంటరీని రా టీవీ, మోటీవ్‌ పిక్చర్స్‌, ఏ24, వెంచర్‌లాండ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 19న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని