varalaxmi sarathkumar: సైకలాజికల్‌ థ్రిల్లర్‌తో...

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శబరి’. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాత. తెలుగు, తమిళ,    మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. 

Updated : 05 Apr 2022 07:00 IST

రలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శబరి’. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత సతీష్‌ వేగేశ్న క్లాప్‌ కొట్టగా.. దర్శకుడు మదన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘క్రైమ్‌ నేపథ్యంలో రూపొందిస్తున్న ఇంటెన్స్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఇది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో వరలక్ష్మి మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈనెల 11 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని