GOAT: విజయ్‌.. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌

తమిళ కథానాయకుడు విజయ్‌ నుంచి సినీప్రియులకు కొత్త ఏడాది కానుక అందింది. ఆయన ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 01 Jan 2024 09:36 IST

మిళ కథానాయకుడు విజయ్‌ నుంచి సినీప్రియులకు కొత్త ఏడాది కానుక అందింది. ఆయన ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో విజయ్‌ రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపించారు. అందులో ఒకటి వయసు పైబడ్డ పాత్ర కాగా.. మరొకటి యంగ్‌ లుక్‌. ఇద్దరూ ఫైటర్‌ జెట్‌ కాస్ట్యూమ్‌లో నడిచొస్తూ కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో నెలపై పడి ఉన్న పారాచూట్‌..     ‘‘వెలుగు చీకటిని కబళించగలదు కానీ, చీకటి వెలుగును ఆక్రమించలేదు’’ అంటూ పోస్టర్‌పై రాసి ఉన్న వాక్యం ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక ఒక వ్యక్తి జీవితంలోని వేర్వేరు దశలను చూపిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని