Virupaksha: ఆ ప్రమాదం దాటడానికే నా ప్రయాణం!

‘‘సమస్య ఎక్కడ మొదలైందో.. పరిష్కారం అక్కడే వెతకాలి’’ అంటున్నారు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej). మరి ఆయనకు ఎదురైన సమస్యేంటి.. దానికి పరిష్కారం ఎలా కనుగొన్నారు? తెలియాలంటే ‘విరూపాక్ష’ (Virupaksha) చూడాల్సిందే.

Updated : 03 Mar 2023 06:44 IST

‘‘సమస్య ఎక్కడ మొదలైందో.. పరిష్కారం అక్కడే వెతకాలి’’ అంటున్నారు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej). మరి ఆయనకు ఎదురైన సమస్యేంటి.. దానికి పరిష్కారం ఎలా కనుగొన్నారు? తెలియాలంటే ‘విరూపాక్ష’ (Virupaksha) చూడాల్సిందే. సాయిధరమ్‌ తేజ్‌. హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. కార్తీక్‌ దండు తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సంయుక్త (Samyuktha) కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి’’ అంటూ సాయిచంద్‌ చెబుతున్న డైలాగ్‌తో ఆరంభమైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. 1990ల కాలం నాటి ఓ ఊరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందించినట్లు అర్థమవుతోంది. విచిత్రమైన సమస్యతో బాధపడుతున్న ఆ ఊరి సమస్యలను పరిష్కరించేందుకు కథానాయకుడు చేసిన ప్రయాణమేంటి? ఈ క్రమంలో అతనికెలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది ఆసక్తికరం.  ‘‘ఆ ప్రమాదం దాటడానికే నా ప్రయాణం’’ అంటూ టీజర్‌లో సాయిధరమ్‌ తేజ్‌. చెప్పిన డైలాగ్‌ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు