Vishwak Sen: విశ్వక్‌సేన్‌ - పూరీ ప్రాజెక్ట్‌.. నిజమెంతంటే..?

నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) , దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో సినిమా రానున్నట్లు వస్తోన్న వార్తలపై నిజమెంతంటే..?

Published : 20 Apr 2023 18:23 IST

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్‌’ (Liger) పరాజయం తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. యువ నటుడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) తో ఆయన సినిమా చేయనున్నారని, ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

కాగా, తాజాగా ఈ వార్తలపై విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని చెప్పారు. ‘‘రిలాక్స్‌. ఇదొక అద్భుతమైన వార్త. కానీ, ఇందులో ఎలాంటి నిజం లేదు. కేవలం వదంతులు మాత్రమే. గత కొన్నిరోజుల నుంచి ఈ వార్తలు చూస్తున్నాను. కాకపోతే పూరీ సర్‌తో కానీ, మరే ఇతర వ్యక్తులతో కానీ ఎలాంటి చర్చలు జరగలేదు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.

‘దాస్‌ కా ధమ్కీ’తో విశ్వక్‌ ఇటీవల ప్రేక్షకులను అలరించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 22న  విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇటీవల ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఇక్కడ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని