విపక్ష నేతల తీరుపై కేంద్రమంత్రి‌ ఫైర్‌

వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విరుచుకుపడ్డారు. ఎగువ సభలో ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరు బాధ్యతారాహిత్యంగా..........

Updated : 21 Sep 2020 23:15 IST

దిల్లీ: వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విరుచుకుపడ్డారు. ఎగువ సభలో ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. బిల్లుల ఆమోదం సందర్భంలో విపక్ష నేతలు అన్ని నిబంధనలనూ ఉల్లంఘించారన్నారు. ఆదివారం రోజున సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు అవమానకరమని, బాధ్యతారాహిత్యమంటూ మండిపడ్డారు. ఇంకొందరు సభ్యులు సోమవారం సస్పెండ్‌ అయినప్పటికీ సభను ఖాళీ చేయలేదని విమర్శించారు. రాజ్యసభలో ఆది, సోమవారాల్లో చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితులపై ఆయన కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ జోషీ, పీయూష్‌ గోయల్‌తో కలిసి మాట్లాడారు.

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదానికి తమకు స్పష్టమైన మెజార్టీ ఉందని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ బిల్లులకు 110 మంది మద్దతు తెలిపితే.. కేవలం 70మంది మాత్రమే వ్యతిరేకించారన్నారు. ఆదివారం కొందరు సభ్యులు రాజ్యసభలో టేబుళ్లపైకి ఎక్కి ఆందోళనలు చేయడాన్ని తప్పుబట్టారు. సభలో డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ ఉండగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుకు బిహార్‌ ప్రజలు ఎంతో బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంల ప్రకటనలను ఉటంకించిన రవిశంకర్‌ ప్రసాద్‌.. ఒప్పంద సేద్యం, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్‌ కమిటీలపై కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని