ఎమ్మెల్యేపై అన్నాడీఎంకే బహిష్కరణ వేటు 

ఎన్నికల వేళ తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ......

Published : 18 Mar 2021 16:17 IST

చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే సి.చంద్రశేఖరన్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు వెల్లడించింది. ఈసారి తనకు అవకాశం ఇవ్వకుండా వేరే వ్యక్తికి పార్టీ టిక్కెట్‌ ఇవ్వడంతో చంద్రశేఖరన్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అంతేకాకుండా పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన వ్యక్తిని ఓడిస్తానని ప్రకటించడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్టు పార్టీ సమన్వయకర్త పన్నీర్‌ సెల్వం, సీఎం పళనిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. శెంతమంగళం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చంద్రశేఖరన్‌కు బదులు ఈసారి ఎస్‌. చంద్రన్‌ అనే వ్యక్తిని అన్నాడీఎంకే బరిలో దించింది. చంద్రశేఖరన్‌ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి పొన్నుస్వామిపై 12వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని