TDP: తెదేపా నేతలపై అక్రమ కేసులు దుర్మార్గం: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ  తెదేపా నేతలపై పోలీసుల అక్రమ కేసుల కొనసాగింపు దుర్మార్గమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విమర్శించారు. 

Published : 11 Mar 2024 11:39 IST

కడప: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపా నేతలపై పోలీసుల అక్రమ కేసులు దుర్మార్గమని ఆ పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విమర్శించారు. కమలాపురం నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తెలుగుదేశం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డిపై  హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. ఘటనాస్థలిలో లేని వ్యక్తిపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని భూమిరెడ్డి ఆరోపించారు. నరసింహారెడ్డిపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని