DK Aruna: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా.. కాళేశ్వరం అవినీతిపై చర్యలేవీ?: డీకే అరుణ

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.

Published : 07 Jan 2024 12:44 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు అవినీతిపై చాలా మాట్లాడిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ అంటే కాలయాపన చేసే యోచనగా కనిసిస్తుందని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పకుండా వస్తాయని డీకే అరుణ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని