Telangana News: పీకే వ్యూహాలు తెలంగాణలో వర్కవుట్‌ కావు: లక్ష్మణ్‌

దేశంలో ఎన్నిపార్టీలు ఏకమైనా ప్రధాని మోదీని ఏమీ చేయలేరని.. మూడోసారి కూడా కేంద్రంలో భాజపాదే అధికారమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌

Updated : 25 Apr 2022 15:24 IST

హైదరాబాద్‌: దేశంలో ఎన్నిపార్టీలు ఏకమైనా ప్రధాని మోదీని ఏమీ చేయలేరని.. మూడోసారి కూడా కేంద్రంలో భాజపాదే అధికారమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే), సీఎం కేసీఆర్‌ వ్యూహాలు తెలంగాణలో వర్కవుట్‌ కావని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

మొన్నటి వరకు భాజపా, కాంగ్రెసేతర ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేశారని.. పీకేతో భేటీ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా ప్రణాళికలు వేసుకుంటున్నారని లక్ష్మణ్‌ అన్నారు. కాంగ్రెస్‌, తెరాసవి చీకటి ఒప్పందాలని.. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయని చెప్పారు. భాజపాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే తమ పార్టీపై కేటీఆర్‌ విమర్శలు చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని