Chandrababu: ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తాం: చంద్రబాబు
గుర్తింపు కార్డులు లేకుండా పోలీసులు తన పర్యటనలో తిరుగుతున్నారని, పలమనేరు డీఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
కుప్పం: ప్రశాంతంగా ఉన్న కుప్పంలో పోలీసుల చేత దాడి చేయించింది సైకో సీఎం అని తెదేపా అధినేత చంద్రబాబు నాయడు ఆరోపించారు. పోలీసుల లాఠీఛార్జిలో గాయపడి కుప్పం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల, పసలరాణి, హరీశ్‌లను ఆయన ఇవాళ పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం ఏమైనా పాకిస్థానా? శత్రుదేశమా? యుద్ధ భూమా? అని ప్రశ్నించారు. ఏ కారణం లేకపోయిన వాళ్ల మనోధైర్యం దెబ్బతీశారని, 1500 మంది పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పోలీసులపై ఒత్తిడి ఉంటే ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు. నిజం నిప్పులాంటిదని.. ఎప్పటికైనా దహించివేస్తుందన్నారు. జగన్ బలవంతంగా నేరాలు ఘోరాలు చేయించి.. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా జైలుకు తీసుకెళ్తారని పోలీసులకు సూచించారు. కందుకూరులో ఎంత మంది పోలీసులను పెట్టారు? మీరే కుట్ర చేసి తొక్కిసలాట జరిగేలా చేసి మీరే కేసులు పెడతారా అని ధ్వజమెత్తారు. తాను రాకూడదని, గ్రామాల్లో తిరగకూడదని ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. అమూల్ బేబీ సీఎం శివశక్తి పాల ధరల గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులు లేకుండా పోలీసులు తన పర్యటనలో తిరుగుతున్నారని, పలమనేరు డీఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్