Cm Kcr: మంత్రులతో సీఎం కేసీఆర్‌ భేటీ.. రాష్ట్రపతి ఎన్నికపై చర్చ?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం..

Published : 10 Jun 2022 10:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలోని భాజపా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ అవుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? మద్దతిచ్చే విషయంలో ఎలా వ్యవహరించాలి?అనే అంశంపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని