Revanthreddy: 23న తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారయింది. ఈనెల 23న రాహుల్ గాంధీ యాత్ర కర్ణాటక నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారయింది. ఈనెల 23న రాహుల్ గాంధీ యాత్ర కర్ణాటక నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై రాహుల్ యాత్రపై సమీక్షించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించినట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 31న జోడోయాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుందని ప్రకటించారు. హైదరాబాద్ చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుందని తెలిపారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో బహిరంగా సభ నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, పటాన్ చెరువు, ఔటర్ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వు ఫారెస్ట్, జోగిపేట్, శంకరంపేట్, మద్దునూర్ ప్రాంతాల మీదుగా జోడోయాత్ర కొనసాగుతుందని వివరించారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tecno Phantom V Flip 5G: టెక్నో నుంచి రూ.50 వేల ఫ్లిప్ ఫోన్.. ఫీచర్లివే..!
-
Parineeti- Raghav Chadha: పరిణీతి- రాఘవ్ చద్దా పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్
-
ICC U19 World Cup 2024: అండర్ -19 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది
-
Priyamani: ‘జవాన్ 2’లో విజయ్!.. ప్రియమణి ఏమన్నారంటే?
-
PM Modi: ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది: మోదీ
-
Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెదేపా