రాజమహేంద్రవరానికి ధూళిపాళ్ల తరలింపు

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)

Published : 13 May 2021 01:38 IST

విజయవాడ: సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు మళ్లీ రాజమహేంద్రవరం తరలించారు. కరోనా సోకడంతో ఇప్పటి వరకు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. తాజాగా నరేంద్రకు కరోనా నెగటివ్‌ రావడంతో తిరిగి తీసుకెళ్లారు. తొలుత అరెస్ట్‌ చేసిన అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే ఆయన్ను ఉంచారు. అయితే అక్కడ నరేంద్రకు కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇప్పుడు కోలుకోవడంతో మళ్లీ తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడ వారంపాటు నరేంద్రను ఐసోలేషన్‌లోనే ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

మరోవైపు ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌ మంజూరు కోరుతూ ఏసీబీ కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. నరేంద్ర కస్టడీని రీకాల్‌ చేయాలని కోర్టును కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు