UP Elections : యూపీలో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్‌

ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉత్తర్‌ ప్రదేశ్‌లో...

Published : 10 Feb 2022 09:00 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉత్తర్‌ ప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. మొదటి దశలో యూపీలోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగుతుంది. 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో విజయం కోసం 623 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  మొత్తం 403 స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌ను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

షామ్లీ, ముజఫర్‌నగర్‌, బాగ్‌పత్‌, మేరఠ్‌, గాజియాబాద్‌, హాపుఢ్‌, గౌతమబుద్ధనగర్‌, బులంద్‌శహర్‌, అలీగఢ్‌, మథుర, ఆగ్రా జిల్లాల్లో జరిగే ఈ ఎన్నికల్లో జాట్‌ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దిల్లీ-యూపీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమం అధికార భాజపాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2017 ఎన్నికల్లో పశ్చిమ యూపీలో భాజపా 58 సీట్లలో 53 సీట్లను గెలుచుకుంది. మరి ఇప్పుడు ఈ ఫేజ్‌లో ఎన్ని సీట్లను గెలుస్తుందో తెలియాలంటే మార్చి 10వ తేదీ వరకు ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని