‘పీకే’ బెంగాల్‌ వెళ్లారా? కేంద్రం విచారణ

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) కార్గో విమానంలో దిల్లీ నుంచి కోల్‌కతా వెళ్లారా అని కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిందని సమాచారం. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఆయన బెంగాల్‌ చేరుకున్నారా లేదా తనిఖీ చేస్తోందని తెలిసింది. వైమానిక అధికారులు దిల్లీ, కోల్‌కతా విమానాశ్రయాల పుటేజీలను....

Published : 25 Apr 2020 00:40 IST

దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) కార్గో విమానంలో దిల్లీ నుంచి కోల్‌కతా వెళ్లారా? అని కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిందని సమాచారం. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఆయన బెంగాల్‌ చేరుకున్నారా లేదా తనిఖీ చేస్తోందని తెలిసింది. వైమానిక అధికారులు దిల్లీ, కోల్‌కతా విమానాశ్రయాల పుటేజీలను పరిశీలిస్తున్నారట. కాగా విమానంలో తాను కోల్‌కతాకు వెళ్లలేదని ప్రశాంత్‌ కిషోర్‌ అంటున్నారు.

‘ప్రస్తుత విచారణపై త్వరలోనే నివేదిక అందుతుంది. డీజీసీఏ, విమానాశ్రయ అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు’ అని వైమానిక శాఖ తెలిపింది. ‘గత నాలుగు రోజుల్లో దిల్లీ నుంచి వెళ్లిన మూడు కార్గో విమానాలను తనిఖీ చేశాం. ప్రశాంత్‌ తమ విమానంలో రాలేదని వారు ధ్రువీకరించారు. దిల్లీ, కోల్‌కతా విమానాశ్రయ పుటేజీలనూ పరిశీలించగా ఆయన జాడ తెలియలేదు. ఈ మధ్య కాలంలో ఎయిర్‌ అంబులెన్స్‌లు సైతం వెళ్లలేదు’ అని మరో అధికారి తెలిపారు.

కరోనా కట్టడి చేయడంలో మమతా బెనర్జీ పూర్తిగా విఫలమైందని భాజపా విమర్శిస్తోంది. ఏం చేయాలో తెలియని ఆమె వ్యూహం రచించేందుకు ప్రశాంత్‌ను బెంగాల్‌కు పిలిపించారని సమాచారం. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ఓ కార్గో విమానంలో ఆయన కోల్‌కతా చేరుకున్నారని వార్తా కథనాలు వచ్చాయి.

చదవండి: కరోనాను చంపేందుకు క్రిమిసంహారకాలను ఎక్కిస్తే: ట్రంప్‌

చదవండి: చైనాలో 2,32,000 కరోనా కేసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని