Eatala Rajender: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారు: ఈటల
భాజపాను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
ఆర్మూర్ పట్టణం, న్యూస్‌టుడే: భాజపాను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో సోమవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారతారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై విలేకరులు ప్రశ్నించగా తనపై ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ‘నేను ఒక పార్టీని నమ్ముకుంటే చివరిదాకా కొనసాగుతాను. కేసీఆర్ వెళ్లగొడితే భాజపా నన్ను అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించింది. ఇతర పార్టీల్లో చిచ్చుపెట్టి గెలిచేందుకు ఆయన చిల్లర రాజకీయాలకు తెరలేపారు’ అని విమర్శించారు.
ముందస్తుకు పోయే దమ్ము కేసీఆర్‌కు లేదు: ఎంపీ అర్వింద్
ఈనాడు, దిల్లీ: ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం సీఎం కేసీఆర్‌కు లేవని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ కుటుంబంలోని నలుగురి జీవితాలు తప్ప సామాన్యుల జీవన స్థితిగతులు మెరుగుపడలేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని భారాస ఎంపీలు బహిష్కరించినా ఏమీ కాదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kamal Anand: రూ.60 కోసం పదేళ్లు పోరాటం
-
India News
Arvind Kejriwal: మోదీ విద్యార్హతపై అనుమానం పెరిగింది: కేజ్రీవాల్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
India News
వెనుకా ముందు యువతులు.. బైక్పై ఆకతాయి చేష్టలు
-
Politics News
Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు: గంటా
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార