ఎన్‌ఎస్‌యూఐ నాయకుల అరెస్టు చట్టవిరుద్ధం

విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ సహా విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపడాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు ఓ సంయుక్త ప్రకటనలో ఖండించారు.

Updated : 05 Feb 2023 05:55 IST

రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ సహా విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపడాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు ఓ సంయుక్త ప్రకటనలో ఖండించారు. సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు.

* అదానీ ఆస్తులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో విచారణ జరిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

* ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్కను టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చల్లా నర్సింహారెడ్డితో కలిసి ఆయన శనివారం సీఎల్పీ కార్యాలయంలో భట్టిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని