కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలి..

హిండెన్‌బర్గ్‌ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ మౌనం వీడాలని భారాస ఎంపీలు డిమాండ్‌ చేశారు.

Published : 22 Mar 2023 04:22 IST

‘హిండెన్‌బర్గ్‌ నివేదిక’పై జేపీసీ వేయాలంటూ పార్లమెంట్‌లో భారాస ఎంపీల నిరసన

ఈనాడు, దిల్లీ: హిండెన్‌బర్గ్‌ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ మౌనం వీడాలని భారాస ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై సభలో చర్చకు అనుమతించాలంటూ భారాస పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభాపక్ష నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు మంగళవారం ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని తిరస్కరించడంతో భారాస ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభల వాయిదా అనంతరం ఇతర విపక్ష సభ్యులతో కలిసి పార్లమెంట్‌ మొదటి అంతస్తు నుంచి నిరసన వ్యక్తంచేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై వాస్తవాల వెలికితీతకు జేపీసీ ఏర్పాటు చేయాలంటూ భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. నిరసన కార్యక్రమాల్లో భారాస లోక్‌సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, బొర్లకుంట వెంకటేష్‌ నేత, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు, పసునూరి దయాకర్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, దివకొండ దామోదర్‌రావు, బడుగుల లింగయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని