భారత్‌లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి

భారతదేశంలోని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా పార్టీ ప్రవాస విభాగం విదేశాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.

Updated : 27 Mar 2023 06:18 IST

 ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఆస్ట్రేలియాలో భారాస ప్రవాస నేతల ప్రచారం 

ఈనాడు, హైదరాబాద్‌: భారతదేశంలోని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా పార్టీ ప్రవాస విభాగం విదేశాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద భారాస నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు. పార్టీ ప్రవాస విభాగం సమన్వయకర్త మహేశ్‌ బిగాల, ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీత ధూపాటి, మహిళా నేతలు స్వప్న, గుల్షన్‌, అమ్రీన్‌, రాజేశ్‌, రవిశంకర్‌, పరశురామ్‌, అజాజ్‌, ఇస్మాయిల్‌, చిరాన్‌ తదితరులు పాల్గొని కవితకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌ బిగాల మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లపై అన్ని దేశాల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, ఎమ్మెల్సీ కవిత లక్ష్యం సాధించేంత వరకు ఆమె వెంటే ఉంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని