Rajaiah: అయినా.. కేసీఆర్‌ గీసిన గీత దాటను: తాటికొండ రాజయ్య

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గీసిన గీత దాటనని, ఆయన ఆదేశాలు పాటిస్తానని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ స్థానం టికెట్‌ దక్కని రాజయ్య మంగళవారం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

Updated : 23 Aug 2023 07:53 IST

టికెట్‌ రాకపోవడంపై భోరుమన్న ఎమ్మెల్యే

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ గీసిన గీత దాటనని, ఆయన ఆదేశాలు పాటిస్తానని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ స్థానం టికెట్‌ దక్కని రాజయ్య మంగళవారం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కార్యకర్తలు కంటతడి పెడుతూ.. స్వాగతం పలకగా భోరున విలపించారు. కార్యాలయ ఆవరణపై పడుకొని వెక్కివెక్కి ఏడ్చారు. ‘‘నియోజకవర్గమే దేవాలయం. ప్రజలే నా దేవుళ్లుగా భావించి పవిత్రమైన వైద్యవృత్తిని వదిలిపెట్టి, స్థానిక నినాదంతో రాజకీయాల్లోకి వచ్చా. కేసీఆర్‌ పిలుపుతో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. నాటి నుంచి నేటి వరకు కేసీఆర్‌కు విధేయుడిగానే ఉన్నా. ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా నీ స్థాయి తగ్గకుండా అవకాశం కల్పిస్తానని చెబితే ఆయన వెంటే నడిచా. కానీ, నిన్నమొన్న జరిగిన పరిణామాలు చూస్తే ఒకరకంగా ఉన్నాయి. అయితే... ఇప్పుడున్న దానికంటే ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్‌ మాటిచ్చారు. వారి మాటకు కట్టుబడి భారాస కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రికి మంత్రి హరీశ్‌రావుతో కలిసి శంకుస్థాపన చేసుకోవాలి. అమరవీరుల స్తూపం నిర్మించుకోవాలి. ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా మార్చుకోవాలి’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీలు రేఖ, జయశ్రీ, సుదర్శన్‌, జడ్పీటీసీ సభ్యుడు రవి, మార్కెట్ ఛైర్మన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని