సిర్పూర్‌ బరిలో ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ప్రకటించారు.

Published : 04 Oct 2023 03:08 IST

20 మందితో బీఎస్పీ తొలి జాబితా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ప్రకటించారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ జనరల్‌ స్థానం నుంచి ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేయనున్నారు. తెలంగాణ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ప్రవీణ్‌కుమార్‌ 2021లో అదనపు డీజీపీ హోదాలో రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. తొలుత రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సిర్పూర్‌ నుంచి పోటీ చేయనున్నట్లు జులైలోనే ప్రకటించిన ప్రవీణ్‌కుమార్‌.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కొంతకాలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భారాస ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప.. 2014 ఎన్నికల్లో బీఎస్పీ బీఫాంపైనే ఎన్నికవడం గమనార్హం. ఇటీవల కాలంలో పలు కేసులతో వివాదాస్పదంగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌కు జాబితాలో చోటు దక్కడం చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జనరల్‌ స్థానం నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. ఖరగ్‌పుర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదివిన దాసరి ఉషకు పెద్దపల్లి అభ్యర్థిత్వం దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు