Ponnam prabhakar: కడియం వ్యాఖ్యలపై ప్రేక్షకపాత్ర ఎందుకు?: మంత్రి పొన్నం

‘‘వారం గడవక ముందే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటున్నారు.. భారాస శాసనసభ్యుడు అవివేకంగా మాట్లాడుతుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తున్నార’’ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Updated : 14 Dec 2023 11:46 IST

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ‘‘వారం గడవక ముందే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటున్నారు.. భారాస శాసనసభ్యుడు అవివేకంగా మాట్లాడుతుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తున్నార’’ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ముట్టుకుంటే కాలిపోతారని వ్యాఖ్యానించారు.  బుధవారం కరీంనగర్‌ ఇందిరాచౌక్‌ వద్ద ఏర్పాటుచేసిన సన్మాన సభలో మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్తు శాఖపై సమీక్ష జరిపితే రూ.85 వేల కోట్లు.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షిస్తే ఆ శాఖలో రూ.56 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తేలిందన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి శ్వేతపత్రం ఇవ్వాలని అధికారులను కోరామన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో మంత్రి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, నాయకులు పాల్గొన్నారు. మొదటిసారి కరీంనగర్‌కు వచ్చిన మంత్రికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని