వివేకా హత్య, కోడికత్తి వ్యూహం జగన్‌దే.. అంగీకరించినందుకు ధన్యవాదాలు

తెదేపా అధినేత చంద్రబాబు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ భేటీపై తెదేపా, వైకాపా నేతలు ఎక్స్‌ వేదికగా శనివారం పరస్పర విమర్శలు చేసుకున్నారు.

Updated : 24 Dec 2023 10:07 IST

మంత్రుల విమర్శల్ని తిప్పికొట్టిన తెదేపా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ భేటీపై తెదేపా (TDP), వైకాపా (YSRCP) నేతలు ఎక్స్‌ వేదికగా శనివారం పరస్పర విమర్శలు చేసుకున్నారు. మంత్రులు పెట్టిన పోస్టుల్ని తెదేపా నేతలు తిప్పికొట్టారు. ‘కోడికత్తి, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య..పీకే ప్లాన్‌ అన్నారు. ఇప్పుడు ఆ పీకేనే ఇంటికి తెచ్చుకున్నారు’ అని మంత్రి అంబటి రాంబాబు చేసిన పోస్టుకు ‘బాబాయ్‌ హత్య, కోడికత్తి వెనక వ్యూహం జగన్‌దేనని అంగీకరించినందుకు ధన్యవాదాలు..కోడిగుడ్డు మంత్రిగారూ..’ అని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి బదులిచ్చారు. ‘మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు’ అని మంత్రి అంబటి రాంబాబు చేసిన పోస్టుకు ‘నిజమే మీ దగ్గర మెటీరియల్‌ లేదు’ అని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని