Nara Lokesh: ప్రతి ఎన్నికలకూ నరబలి జరగాల్సిందేనా?: నారా లోకేశ్‌

తండ్రి శవంతో పార్టీ ప్రారంభించిన సీఎం జగన్‌, బాబాయి బలితో 2019 ఎన్నికల్లో గెలిచారని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు.

Updated : 13 Mar 2024 08:11 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తండ్రి శవంతో పార్టీ ప్రారంభించిన సీఎం జగన్‌, బాబాయి బలితో 2019 ఎన్నికల్లో గెలిచారని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. వైకాపా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమైన సమయంలో ఓ మహిళ శవంతో వికృత రాజకీయాలు ప్రారంభించారని మంగళవారం ఎక్స్‌లో మండిపడ్డారు. ‘గీతాంజలి అనే మహిళతో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. బాధితురాలు 7వ తేదీన ప్రమాదానికి గురయ్యారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదు. తీవ్రంగా గాయపడి నాలుగు రోజులు మృత్యువుతో పోరాడినా ఆమెకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయలేదు. కనీసం వైకాపా వాళ్లు అటువైపు చూడనేలేదు. చనిపోతే ఆమె శవంతో రాజకీయాలు చేస్తున్నారు. గీతాంజలితో పిల్ల సజ్జల గ్యాంగ్‌ చెప్పించిన అబద్ధాలను ఖండిస్తూ.. తెదేపా అభిమానులు పదో తేదీన ప్రశ్నించారు. బాధితురాలు ఏడో తేదీనే గాయపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే బాబాయి గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించినవారే ఈ మరణాన్ని తమ వికృత రాజకీయాలకు వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది’ అని మండిపడ్డారు. బలి జాబితాలో ఇంకా ఎందరున్నారో? అని అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని