రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Published : 16 Apr 2024 05:26 IST

దిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దేశంలో ఒకే భాషను రుద్దాలని మోదీ భావిస్తున్నారని, కేంద్రంలోని అధికార పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్‌ పేర్కొంటున్నారని.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న రాహుల్‌పై చర్య తీసుకోవాలని కోరింది. ఈ మేరకు భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదిలతో కూడిన బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని