2 రోజులు ప్రచారం చేయొద్దు.. సుర్జేవాలాపై ఈసీ నిషేధం

సినీనటి, భాజపా మథుర ఎంపీ హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలాపై ఈసీ కొరడా ఝళిపించింది. రెండ్రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఆయన్ను ఆదేశించింది.

Updated : 17 Apr 2024 06:16 IST

దిల్లీ: సినీనటి, భాజపా మథుర ఎంపీ హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలాపై ఈసీ కొరడా ఝళిపించింది. రెండ్రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఆయన్ను ఆదేశించింది. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని  మందలించింది. అంతకుముందు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ సుర్జేవాలాకు ఈసీ నోటీసులు పంపింది. ఆయన పంపిన సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ.. 48 గంటలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని