భాజపా, కాంగ్రెస్‌లకు ఓట్లు అడిగే హక్కు లేదు

త లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్‌లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Published : 20 Apr 2024 03:10 IST

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నామినేషన్‌ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: గత లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్‌లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌లో భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించిన అనంతరం అనంతరం కలెక్టరేట్‌ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కేంద్రం నుంచి ఉమ్మడి జిల్లాలోని ఒక్క అభివృద్ధి పనికీ నిధులు అందలేదని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ పార్టీ మోసానికి మారుపేరుగా నిలిచిందని, అసెంబ్లీ ఎన్నికల ముందు అమలుకు సాధ్యంకాని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఎంపీగా రాములును గెలిపిస్తే పార్లమెంటులో 223 రోజుల్లో కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన కుమారుడికి భాజపా టికెట్‌ ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని