Congress: వైకాపా వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకెళ్తాం: కాంగ్రెస్‌ నేత రుద్రరాజు

రాష్ట్రంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు.

Updated : 21 Feb 2024 20:29 IST

విజయవాడ: రాష్ట్రంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమావేశమవుతారని తెలిపారు. చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విభజన హామీలు, రాజధాని వంటి అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈనెల 26న అనంతపురంలో నిర్వహించే బహిరంగసభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు