Goa election Result: గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ.. గవర్నర్‌ను కలవనున్న భాజపా

తీర రాష్ట్రం గోవాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా రెడీ అవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీకి కొద్ది దూరంలో

Published : 10 Mar 2022 14:21 IST

పనాజీ: తీర రాష్ట్రం గోవాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా రెడీ అవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయిన కాషాయ పార్టీ.. స్వతంత్రులతో కలిసి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరనున్నట్లు భాజపా వెల్లడించింది. ‘‘గోవాలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి తిరిగి అధికారంలోకి వస్తాం’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. 

తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భాజపా 8 స్థానాల్లో విజయం సాధించి.. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే 40 సీట్లున్న గోవాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 స్థానాలు సాధించాలి. ప్రస్తుతం భాజపా అతిపెద్ద పార్టీగా అవతరిస్తున్నప్పటికీ స్పష్టమైన మెజార్టీ ఇంకా దక్కలేదు. దీంతో స్వతంత్రుల మద్దతు కోరుతోంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వీరి మద్దతుతో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 

ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌ రెండో స్థానానికి పరిమితమైంది. ఈ పార్టీ ప్రస్తుతం 4 స్థానాల్లో గెలుపొందగా.. మరో 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ) కూడా భాజపాకు మద్దతిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ) ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందగా.. తృణమూల్‌ కూటమి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని