Harish Rao: ఆటో డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాలి.. హరీశ్‌రావు డిమాండ్‌

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్లలను రోడ్డుపై వదిలేశారని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.

Updated : 13 Jan 2024 15:26 IST

సిద్దిపేట: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్లను రోడ్డుపై వదిలేశారని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం వీరికోసం ఆలోచన చేసి నెలకు రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవడం సరి కాదన్నారు. అలాగే మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు పెంచాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని