Telangana News: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు హైకోర్టులో ఊరట లభించింది. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరుచేసింది.
హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అనుమతి రద్దు చేశారు. పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించిన అమెను అడ్డుకున్న నర్సంపేట పోలీసులు హైదరాబాద్ తరలించారు. షర్మిల పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని, పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైతెపా సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెరాస కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. షర్మిల పాదయాత్రకు అనుమతించింది. అయితే, ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. సీఎం కేసీఆర్‌పై, రాజకీయ, మతపరమైన అంశాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆదేశించింది. పాదయాత్ర కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించిన హైకోర్టు.. పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి